Durgam Cheruvu: దుర్గం చెరువు వద్ద ఇప్పటివరకు రెండేళ్లలో ఎనిమిది మంది ఆత్మయత్నం చేశారని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మాధాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి పాయల్ అనే యువతి ఆత్మహత్యపై డీసీపీ స్పందించారు. రెండేళ్లలో ఇప్పటి వరకు దుర్గం చెరువు వద్ద ఎనిమిది మంది ఆత్మయత్నం చేశారని అన్నారు. అందులో ఇద్దరిని కాపాడామని అన్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై నుండి పాల్పడుతున్నారని పోలీసు అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వాకర్స్ వెళ్ళేటప్పుడు నిఘా ఉంచుతున్నామని అన్నారు. నిన్న మధ్యాహ్నం దుర్గం చెరువులో యువతి దూకిందని, ఆ టైంలో ఆమెతో పాటు మరొకరు కూడా ఉన్నారని అన్నారు. చెరువులో బురద ఉండటంతో అందులో ఇరుక్కుపోయిందని భావిస్తున్నామని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్ టీం సెర్చ్ చేస్తుందని అన్నారు.
Read also: Sree Leela: నువ్వు అలా పిలవాలే కానీ… కుర్రాళ్లు ఎక్కడికైనా వస్తారు
మాధాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన పాయల్ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం నిమిత్తం ఈ యువతి జాబ్ కోసం నగరానికి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని ఒకరి ఇంట్లో హౌస్‌మేడ్‌గా చేరింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు.. పాయల్ తన స్నేహితురాలితో కలిసి డీమార్ట్‌లో షాపింగ్ చేసింది. అక్కడి నుంచి వీళ్లిద్దరు నేరుగా కేబుల్ బ్రిడ్జికి వెళ్లారు. కేబుల్ బ్రిడ్జి ఫుట్‌ఫాత్‌పై సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు నడిచారు. ఇంతలో పాయల్ కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఒక్కసారిగా దూకేసింది. పాయల్ చర్యతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమె స్నేహితురాలు.. పాయల్ చెరువులోకి దూకుకుండా కాపాడేందుకు ఆపే ప్రయత్నం చేసింది. కానీ.. ఆమె ప్రయత్నం విఫలమైంది. భయంతో వణికిపోయిన పాయల్ స్నేహితురాలు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆమె సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుర్గం చెరువులో పాయల్ మృతదేహం కోసం డీఆర్ఎఫ్ టీమ్ గాలిస్తున్నారు. పాయల్ సూసైడ్‌కి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ యువకుడ్ని పాయల్ గాఢంగా ప్రేమిస్తోందని, అయితే ఆమె కుటుంబసభ్యులు అందుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసింది. కుటుంబీకులు తమ ప్రేమని అంగీకరించడం లేదు కాబట్టి, అతనితో తనకు పెళ్లి జరగదన్న మనస్థాపంతోనే పాయల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Sree Leela: నువ్వు అలా పిలవాలే కానీ… కుర్రాళ్లు ఎక్కడికైనా వస్తారు