హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో వున్న మాదాపూర్ వడ్డెరబస్తీ వాసులు కలుషిత నీటితో నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరికొందరు అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 98కి చేరింది. వాంతులు, విరేచనాలతో కొత్తగా 15 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నారు. 26 మంది ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. కొండాపూర్, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స అందుకుంటున్న వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. వడ్డెరబస్తీని సందర్శించిన జలమండలి ఎండీ దాన కిషోర్ ఇంటింటికి వెళ్లిన ప్రజల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. బస్తీలో సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీటి నాణ్యతను పరీక్షించాలన్నారు. బస్తీలో 69నల్లా కనెక్షన్లకు ట్యాప్‌లు లేకపోవడంతో వాటిని బిగించారు. మరుగుదొడ్ల పక్కన వున్న నీటి కనెక్షన్ల వల్ల నీరు కలుషితం అవుతోందని గుర్తించారు.
https://ntvtelugu.com/contaminated-water-danger-bells-at-madhapur-basti/
