నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ప్రొఫెసర్ కోదండరాం కృష్ణ జలాల పరిరక్షణ యాత్రలో భాగంగా వాసవి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు కృష్ణ బోర్డ్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశ్మలో శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ఉన్న 15 ఔట్ లెట్స్ కావాలని అడుగుతున్నారన్నారు. ఆర్డీఎస్ 15.9టీఎంసీల రావాలి కానీ సగం కూడా రావడం లేదు. ఈ అంశంపై ఇప్పటికీ కూడా మనకు న్యాయం చెయ్యలేక పోయింది. తప్పని సరిగా కృష్ణ బోర్డ్ ఆర్డీఎస్ విషయంలో తెలంగాణ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కు 811 టీఎంసీలకుకు గాను 299 టీఎంసీ కేటాయిస్తూ తాత్కాలిక కేటాయింపు ఇస్తున్నారని, కృష్ణలో గోదావరి నీళ్లను కలుపుతున్నారు కానీ అందులో మన వాటా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ రోజు కృష బోర్డ్ సమావేశంలో తెలంగాణకు న్యాయ సంబంధమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రని కోట్లాది తెచుకుందే నీళ్లు నిధులు నియామకాలు కానీ ఇప్పటికి నీటి విషయంలో మనకు న్యాయ సంబంధమైన వాటా దక్కలేదన్నారు. మన హక్కు కోసం ఎన్నడూ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడింది లేదని, సత్వరమే కృష్ణ నది కింద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరిగే సమావేశంలో కృష్ణ ట్రిబ్యునల్ ముందు మనకు రాబోయే వాటా ని సాధించే విధంగా కొట్లాడలని, నల్లగొండ జిల్లా చేనేత కార్మికులకు కూడా బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలి. ముడి సరుకు రేట్స్ తగ్గించాలన్నారు. రైతులకు ఉన్న విధంగా చేనేత కార్మికులకు కూడా బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కోదండ రామ్.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిచిన ధాన్యంను సత్వరమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు.