NTV Telugu Site icon

తెలంగాణలో చలిపులి పంజా..6.2 డిగ్రీలే

తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై చలి పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి టి లో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, బేలాలో 7.8 డిగ్రీలుగా వుంది. చెప్రాలలో 8డిగ్రీలుగా వుంది. నిర్మల్ జిల్లా తానూర్ లో 7.2 డిగ్రీల సెల్షియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

పెంబిలో 8.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు కావడంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. ఇటు మంచిర్యాల జిల్లా ర్యాలీ లో 8.2 డిగ్రీలు, కవ్వాల్ టైగర్ జోన్ లో 8.3 డిగ్రీలు, కొమురం భీం జిల్లా వాంకిడి లో7.7 డిగ్రీలు నమోదైంది. తిర్యాని లో 8.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు అయ్యాయి. ఇటు ఆంధ్రాలోనూ ఉష్ణోగ్రతల పతనం కనిపిస్తోంది. విశాఖ ఏజెన్సీలో కనిష్ట స్థాయికి పడిపోయాయి ఉష్ణోగ్రతలు. చింతపల్లి 3డిగ్రీలు నమోదవడంతో జనం చలికి వణుకుతున్నారు. అరకులో 8 డిగ్రీలు, పాడేరులో 9 డిగ్రీలు, మినుములూరులో 7డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.