ఇటీవల జరిగిన ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో 8 ప్రశ్నలు వచ్చినట్లు గుర్తించిన TSLPRB వాటిని తొలగించినట్లు పేర్కొంది. అభ్యర్థులకు ఆ 8 ప్రశ్నలకు 8 మార్కులను కలిపింది. కాగా ఇప్పటివరకు మొత్తం 200 మార్కుల్లో 60(30 శాతం) మార్కులు వస్తే తర్వాతి దశకు క్వాలిఫై చేసేవారు. కానీ 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నందున ప్రిలిమ్స్ 52 మార్కులు వచ్చినా క్వాలిఫై చేయనున్నారు.
ఎస్సై ప్రాథమిక పరీక్షలో దొర్లిన కొన్ని తప్పులు కొందరు అభ్యర్థుల పాలిట వరంగా మారునుంది. మొత్తం 200 మార్కులకు ఆగస్టు 7న నిర్వహించన ప్రాథమిక రాత పరీఓ ప్రిటిమినరీ కీ ని టీఎస్‌ఎల్పీఆర్బీ ఆగస్టు 12 (శుక్రవారం) విడుదల చేసిన విసయం తెలిసిందే. అయితే ప్రిటిమినరీ కీలో పేర్కొన్న ప్రకారం తప్పులు దొర్లిన మొత్తం 8 ప్రశ్నలను తొలగించినట్లు బోర్ధు తెలిపిన విసయం తెలిసిందే. అయితే ఆ ఎనిమిది ప్రశ్నలకు 8 మార్కులను అభ్యర్థులకు కలపనున్నట్లు బోర్ధు వర్గాలు శుభవార్త చెప్పడంతో.. అభ్యర్థుల్లో ఆనందాన్ని నింపింది.
read also: Chinese “Spy” Ship: శ్రీలంక బుద్ధి మారలేదు.. భారత్ అభ్యంతరం తెలిపినా చైనా నౌకకు ఆశ్రయం
కాగా.. వాస్తవానికి 200 మార్కులను నిర్వహించన ప్రాథమిక పరీక్షలో 60(30)శాతం వస్తే వారిని తర్వాతి దశకు అర్హులుగా నిర్ణయించారు. అంటే మొత్తం 8 ప్రశ్నలకు తప్పుగా ఉన్నందున ప్రాథమిక పరీఓలో 52 మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం తర్వాతి దశకు అర్హలుగా గుర్తంచనున్నట్లు ఉన్నాతాధికారి తెలిపారు. అంటే 60 మార్కులకు బదులు, 52 మార్కులు సాధించిన వారు సైతం తర్వాతి దశకు అర్హత సాధించినట్టే. అయితే www.tslprb.inలో ప్రిలిమనరీ కీ అందుబాటులో ఉన్నందున అభ్యర్థులు వారి బుక్‌లెట్ కోడ్ ఆధారంగా సరిచూసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
కొత్త రికార్డు దిశగా టీఎస్‌ఎల్పీఆర్బీ
అయితే.. ఆగస్టు 28 నిర్వహించనున్న కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షతో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి కొత్త రికార్డు నమోదు చేయబోతుంది. అయితే.. స్వరాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగార్థులకు పోటీ పరీక్ష నిర్వహించిన ఘనతను సొంతం చేసుకోనున్నది. గతంలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా 5.80 లక్షల మంది అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. కాగా.. ఆ తర్వాత అంత పెద్ద సంఖ్యలో 6.5 లక్షలు మంది అభ్యర్థులు హాజరుకానున్న పరీక్షగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రికార్డు నెలకొల్పనున్నది. ఈ పరీక్షకు 1,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ వర్గాలు తెలిపాయి. అయితే వాస్తవానికి ఈ పరీక్షను ఈ నెల 21న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ 28కి వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ విధానంలోనే హాజరు తీసుకోనున్నారు.
25 Years for ‘Encounter’ Movie: పాతికేళ్ళ ‘ఎన్ కౌంటర్’
