Site icon NTV Telugu

Love is Crazy: దానికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది..

Hanumakonda

Hanumakonda

Love is Crazy: హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. కాజీపేటలో ప్రేమోన్మాది ఘూతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని, ప్రేయసి గొంగుకోశాడు దుర్మార్గుడు. ఆయువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిన్న రాత్రి మండలంలోని కడిపికొండలో జరిగింది.

Read also: Astrology : జనవరి 04, బుధవారం దినఫలాలు

కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్‌ తన గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమో కూడా ఇతడిని ప్రేమించింది. అయితే ఇద్దరి మతాలు వేరు. అందుకే శ్రీనివాస్‌ ఆమెకోసం మతం కూడా మార్చుకున్నాడు. కొంతకాలం వీరిద్దరి ప్రేమ బాగానే సాగిన, వీరి ప్రేమలో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య కొద్ది రోజులు గొడవలు మొదలయ్యాయి. నిన్న రాత్రి ఇదే విషయమై శ్రీనివాస్‌ యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి గురించి మరోసారి యువతిని నిలదీశాడు. తమ కుటుంబ సభ్యులు వద్దన్నారని దీనికి యువతికూడా నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్‌ పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి గొంతు, చేయి కోశాడు. యువతి కేకలు వేయడంతో.. కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి, చితకబాదారు. పోలీసులకు సమాచారం అందడంతో మడికొండ పోలీస్‌ స్పెక్టర్‌ గుజ్జేటి వేణు తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. యువతిని వరంగల్‌ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిపారు. శ్రీనివాస్‌ ను అదుపులో తీసుకున్నారు. కుటుంబ సభ్యులను శాంతిపచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News: 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి, ఆపై విషం పెట్టి..

Exit mobile version