NTV Telugu Site icon

AP-Telangana: సన్న ధాన్యంకు బోనస్.. ఆంధ్రా నుంచి తెలంగాణకు భారీగా లారీలు

Ap To Telangana

Ap To Telangana

AP-Telangana: సన్న ధాన్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో బోనస్ కోసం ఆంధ్రా నుంచి భారీ ఎత్తున తెలంగాణకు ధాన్యం అక్రమ రవాణా జరుగుతుంది. ఇలా అడ్డ దారిలో వస్తున్న ధాన్యం లారీలను ఖమ్మం జిల్లా నేలకొండ పల్లి, ముదిగొండ వద్ద చెక్ పోస్టులలో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇక్కడ చెక్ పోస్టు అధికారులు ఫైన్ విధించి వదిలివేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లాలో ఆంధ్ర నుంచి వచ్చిన సన్న ధాన్యం కొనుగోళ్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.

Read also: Crime News: లండన్‌లో 24 ఏళ్ల భారతీయ మహిళ హత్య.. భర్తే కాలయముడు

దీనితో నల్గొండకు ఎన్టిఆర్ జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి వస్తున్నాయి. అయితే జగ్గయ్య పేట నుంచి నేషనల్ హైవే మీదుగా కోదాడకు సన్న ధాన్యం కోసం లారీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ధాన్యం వస్తుందని ఆరోపణలు ఉన్ననేపథ్యంలో తెలంగాణ-ఆంధ్ర చెక్ పోస్టు అయిన దోరబండ గూడెం వద్ద భారీ ఎత్తున లారీలను తనిఖీలుచేస్తున్నారు అధికారులు.

Read also: MLC Kavitha: పైసలా కోసం పార్టీ మారినవాడు నాయకులా..? సంజయ్ పై కవిత కామెంట్

ఇలా ప్రధాన మైనరహదారిలో తనిఖీలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న వ్యాపారస్తులను లారీలను అడ్డ దారిలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే జగ్గయ్యపేట మండలం నుంచి ముదిగొండ మండలం అయిన వల్లబి మీదుగా ఆ తరువాత అప్పల నరసింహ్మ పురం నుంచి మళ్లీకోదాడ వైపు లారీలను మళ్లిస్తున్నారు. ఇలా ఈ ఒక్క రోజే దాదాపుగా యాబై లారీలకు పైగా వచ్చినట్లుగా సమాచారం. దీంతో వల్లభి సమీపంలో అప్పల నర్సింహాపురం వద్ద భారీ ఎత్తున లారీలను పట్టుకొని వాటికి పైన్ లు విధించి పంపించి వేస్తున్నారు.

Read also: CM Chandrababu: రాష్ట్ర విభజన కంటే.. వైసీపీ ప్రభుత్వం వల్లే ఎక్కువ నష్టం: సీఎం చంద్రబాబు

పైన్ విధించిన తరువాత ఆ లారీలు మళ్లీ ఉమ్మడి నల్గొండ జిల్లా వైపు వెళుతున్నాయి. ఇది తెలంగాణ ఆర్ధిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లే అవకాశం కూడ ఉంది. అయితే ఈ లారీలను మళ్లీ ఆంధ్రకు తరలించాల్సి ఉండగా ఆ విధంగాచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం, అధికారులు ఎలా స్పందిస్తారనే దానిపై వేచి చూడాల్సి ఉంది.
Raj Kapoor: పాకిస్థాన్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడి శత జయంతి వేడుకలు…

Show comments