NTV Telugu Site icon

Gadwal: సారీ కాదు కాళ్లే మొక్కుతా.. లోక్ అదాల‌త్‌లో హృదయాలను కదిలించే సంఘటన

Jogulamba Gadwal Jlla

Jogulamba Gadwal Jlla

Gadwal: జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గద్వాల పట్టణంలోని సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవింద్ కు రాజేశ్వరి అనే మహిళతో వివాహమైంది. అయితే గోవిందు తాగిన మైకంలో తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో విసిగిపోయిన రాజేశ్వరి ఎట్టకేలకు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత రాజీ కోసం జాతీయ లోక్ అదాలత్‌ను ఆశ్రయించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.కుషా సమక్షంలో జరిగిన లోక్ అదాలత్‌లో మొదటి అదనపు జిల్లా జడ్జి అన్నీరోస్ క్రిస్టియన్, సీనియర్ సివిల్ జడ్జి గంటా కవిత, జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ నాయక్ భార్య భర్తలిద్దరిని పిలిపించి ఏం జరగిందని అడిగారు. రాజేశ్వరి తన భర్త అంటే ఇష్టమే కానీ రోజూ తాగి వచ్చి తనపై దాడి చేస్తాడని తెలిపింది. గోవింద్ భార్య చెప్పింది నిజమేనని ఒప్పుకున్నాడు. తాను చేసింది తప్పే కానీ.. పెద్దవాళ్లు ఏం చెబితే అదే చేస్తానని తెలిపాడు.

Read also: Rural Constable: కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం.. జీవో నం.46 సవరణ చేయాలని నిరసన

అయితే అక్కడున్న వారందరూ దంపతులను పిలిచి పూల దండలు మార్చుకునేందుకు అనుమతించారు. అందరి సమక్షంలోఇద్దరూ దండలు మార్చుకున్నారు. భార్యభర్తలిద్దరూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా గోవింద్ భావోద్వేగానికి గురయ్యారు. తాగిన మైకంలో భార్యను కొట్టడం తప్పేనని నిజాయితీగా ఒప్పుకున్నాడు. క్షమాపణ చెప్పాలని న్యాయమూర్తులు కోరగా.. తన భార్యకు క్షమాపణలు చెబుతానని చెప్పాడు. క్షమాపణలే కాదు కాళ్లు ముక్కుతా అంటూ అంత మంది ముందు భార్యకాలు పట్టుకున్నాడు. దీంతో అక్కడకు వచ్చిన వాళ్లందరూ తప్పట్లు, విజిల్స్ వేశారు. నిజానికి తన భార్య తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటుందని గోవింద్ అన్నాడు. అందుకే ఇకపై ఎలాంటి తప్పు చేయనని గోవింద్ చెప్పాడు. ఈ ఘటనతో లోక్ అదాలత్ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది.
Minister KTR: డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‎గా కూడా నిర్మాణాలు జరగాలి