చైనాకు షాకిచ్చిన శాంసంగ్ మొబైల్స్.. ఫ్యాక్టరీ ఇండియాకు తరలింపు

చైనాకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ శామ్‌సంగ్‌… చైనాలో నిర్మించాలనుకున్న డిస్‌ ప్లే తయారీ యూనిట్లను యూపీలోని నోయిడాకు షిఫ్ట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే శామ్‌సంగ్‌ సంస్థ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈఓ కెన్‌ కాంగ్‌ నేతృత్వంలోని శామ్‌సంగ్‌ ప్రతినిధి బృందం యూపీ సీఎం యోగిని కలిసింది. మెరుగైన పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడిదారుల- స్నేహపూర్వక విధానాల కారణంగా.. తమ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శామ్‌సంగ్‌ సంస్థ ప్రతినిధి బృందం పేర్కొంది. అయితే.. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం యోగి… భవిష్యత్తులోనూ శామ్‌సంగ్‌ సంస్థకు స్టేట్‌ గవర్నమెంట్‌ ప్రభుత్వం సాయం కొనసాగిస్తుందని ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-