ఆందోల్ క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జమున హేచరిస్ విషయంలో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమున హేచరిస్ విషయంలో హైకోర్టు ఆదేశాల ప్రకా రమే రీసర్వే జరిగిందన్నారు. జమున హెచరిస్ విషయంలో సీలింగ్ భూముల్లో అన్యాయం జరిగిందంటూ అక్కడి రైతులు న్యాయం కోసం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో కలెక్టర్ సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. కానీ కరోనా సమయంలో ఈటెల రాజేందర్ సర్వే పనులు ఎందుకని కోర్టుకు వెళ్లారన్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సర్వేచేసి కోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు . కానీ ఆ విషయంలో బీజేపీ నేతలు రాజ కీయ రంగును పులిమే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఈటల రాజేందర్ గెలిస్తే అవినీతిఆరోపణలు మాయం అవుతాయ అని ఆయన ప్రశ్నించారు. అధికారుల చేస్తున్న విధినిర్వహణకు బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారన్నారు. దయచేసి బీజేపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చే పనులను, ప్రయత్నాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. తప్పుడు రిపోర్టులు ఇవ్వాలని అధికారులపై బీజేపీ నాయకులు ఒత్తిళ్లు చేయ డం సరికాదన్నారు. జమున హెచరిస్ పై కోర్టు డైరెక్షన్ ప్రకారమే రిసర్వే జరుగుతుందని, అధికారులను ఈ విషయంలోకి లాగడం సరికాదన్నారు. కోర్టు డైరెక్షన్ ప్రకారమే అధికారులు తమ పని వారు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.
