Live Updates : SP Anuradha Sensational Press Meet Over Violence At Secunderabad Railway Station
సికింద్రాబాద్ రైల్వే స్టెషన్ ఘటనపై మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు రైల్వే ఎస్పీ, ఆర్పీఎఫ్ ఇంచార్జ్ . ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారి వివరాలు వెల్లడించనున్నారు అధికారులు. కాల్పుల ఘటనపై స్పష్టత ఇచ్చే అవకాశం వుంది. ఈ ఘటనలో పాల్గొన్న, ప్రేరేపించిన ఇతర నిందితులు, కేసు దర్యాప్తు పై వివరాల వెల్లడించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరగనుంది.
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కామారెడ్డి నుంచి వచ్చినవారు వున్నారు. పబ్లిక్ సేఫ్ గా ట్రావెల్ చేయవచ్చు. అన్ని రైళ్ళు షెడ్యూల్ పరంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎవరూ భయపడవద్దు. పరిస్థితి అంతా నార్మల్ గా వుంది.
What's app groups:
Railway station block group
Hakim pet army group
Soliders die group
ఇప్పటి వరకూ వచ్చిన వాళ్లు అందరూ తెలంగాణ వాళ్ళే. అంతా ఒక్కసారిగా స్టేషన్లోకి ఎంటర్ అయ్యారు. పోలీసుల్ని తోసుకుంటూ.. సీసీటీవీలు, రైల్వే డిస్ ప్లే బోర్డులు నాశనం చేశారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, అజంతా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులు వున్నారు. ఈ రైళ్ళన్నీ బయలుదేరడానికి సిద్ధంగా వున్నాయి. 4 కోచ్ లను, కార్గో కోచ్ లు తగులబెట్టారు.
ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఈ ఘటనకు కారణం అయినవారు, ప్రేరేపించినవారిని వదిలిపెట్టం. ఆర్పీఎఫ్ సిబ్బంది వైద్య సేవలు అందించాం. ముగ్గురు మా సిబ్బంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ కేసుల్ని హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేస్తున్నాం. మేం హింస జరగకుండా ప్రయత్నించాం. రైల్వే స్టేషన్లో తగిన సిబ్బంది వున్నాం. అదనపు సిబ్బంది రావడానికి మరో గంట సమయం పట్టింది. ఈ ఘటనలో ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినవారు ఉన్నారు. మరికొందరు రాయడానికి సిద్ధపడ్డవారు వున్నారని అనురాధ తెలిపారు.
సికింద్రాబాద్ ఘటనలో 16మందికి గాయాలయ్యాయి. 9 మంది పోలీసులు గాయపడ్డారు. 12 కోట్ల నష్టం జరిగింది. మరింత నష్టం అంచనా వేస్తున్నాం. ప్రయాణికులు ఈ ప్రమాదం జరిగినప్పుడు బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో పాల్గొన్నవారి కెరీర్ నాశనం అవుతుంది. వారికి జీవిత ఖైదు పడుతుంది. పోలీసుల విచారణ జరుగుతోంది. విచారణలో మరింత మందిని కనుగొంటామన్నారు ఆర్పీఎఫ్ పోలీసులు.
ఈ దాడి, విధ్వంసం వెనుక కోచింగ్ సెంటర్ల హస్తం వుంది. ఇంతమంది మోటివేట్ అవడానికి సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టుకున్నారు. రైల్వే స్టేషన్ బ్లాగ్ గ్రూప్, ఛలో సికింద్రాబాద్ గ్రూప్, సోల్జర్స్ గ్రూప్ వంటి వాటి ద్వారా మెసేజ్ లు సర్క్యులేట్ చేశారు. 2 వేలమంది వరకూ స్టేషన్ కు వచ్చారు. ఇంకా ఎవరెవరు వున్నారనేది ఐడెంటిఫై చేస్తున్నామన్నారు ఎస్పీ అనురాధ. ఫైరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె వివరించారు. లోకో ఇంజన్లు, 4 వేల లీటర్ల ఆయిల్ వుంది. ప్రయాణికులను రక్షించడానికి ఫైరింగ్ చేశాం. ప్రాణ నష్టం తగ్గించడానికి ఈ పనిచేశాం.
సికింద్రాబాద్ లో ఆందోళకారులు 30 రైల్వే కోచ్ లు తగులబెట్టారు.4 కోచ్‌లు పెట్రోల్ పోసి తగులబెట్టారు. అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ రిక్రూట్ మెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ నాశనం చేశారు. పోలీసులు, ప్రయాణికుల మీద రాళ్ళ దాడి జరిగింది. వివిధ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు నాశనం చేస్తే ఏ ఉద్యోగాలకు వారు అర్హులు కాదు. ఏ ఆస్తిని పాడుచేయవద్దు. శాంతియుతంగా నిరసన తెలపాలి. యూత్ అంతా పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయవద్దు. 46 మందిని అరెస్ట్ చేశాం. 2 వేలమంది ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్ధులుగా గుర్తించాం.
సికింద్రాబాద్ ఘటన వెనుక నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ హస్తం వుందని అనుమానిస్తున్నారు. ఈ అకాడమీకి సుబ్బారావు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సొంతూరు ఖమ్మంలో సుబ్బారావు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సుబ్బారావును నరసరావుపేటకు తరలించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు వచ్చినట్లు గుర్తించారు. ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. విద్యార్థులకు వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు.. ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు పాల్గొన్నట్లు గుర్తించారు. అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12కోట్లు ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ రైల్వే డివిజినల్ మేనేజర్ గుప్తా తెలిపారు. 5 రైల్ ఇంజన్లు, 30 బోగీలు ధ్వంసమయ్యాయని గుప్తా వెల్లడించారు. స్టేషన్ లో విధ్వంసంతో పాటు ఆందోళనకారుల రాళ్ల దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి. కాల్పుల్లో దామెర రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. 12మంది గాయపడ్డారు.
అగ్ని పథ్ స్కీంకి నిరసనగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన కారులు బోగీలకు నిప్పుపెట్టి, రైల్వే ఆస్తులను నష్టపరిచిన కేసులో 52 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ అల్లర్ల వెనుక కుట్ర కోణం దాగి ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అల్లర్లలో దాదాపు 200 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. అసలు అగ్నిపథ్ నిరసనల వెనుక కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను నర్సారావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తి రెచ్చగొట్టినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.