వ్యవసాయ రంగాన్ని పండగ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కానీ ప్రతి పక్షాలు ఇష్టానుసారంగా, భూతులు, అవస్తవాలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉంటూ, చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో పీసీసీ తెచ్చుకున్న వ్యక్తి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.
రైతు ఆత్మహత్యల గురించి అవాస్తవాలు చెప్తున్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గుతున్న రాష్ట్రం తెలంగాణ అని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. ఒక లుచ్చా రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు నరేంద్రసింగ్ తోమర్ పార్లమెంట్ లో చెప్పాడు..వీడికి హిందీ రాదు,ఇంగ్లీష్ రాదు చదువుకోవడం రాక తెలంగాణ లో 8400 రైతుల ఆత్మహత్యలు పెరగాయని ప్రకటిస్తున్నాడు..ఈ లత్కోర్ నా కొడుకు రైతు బీమా రావటం లేదని అబద్దాలు చెప్తున్నాడు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పథకాలు ఇస్తున్నారా లేదా ఈ వెధవ తెలుసుకోవాలని ఘాటుగా స్పందించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.