Site icon NTV Telugu

LIVE: బండి సంజయ్ ప్రెస్ మీట్

కేసీఆర్ లొల్లి లేని దగ్గర లొల్లి చేస్తున్నాడు. బస్ ఛార్జ్ లు చెప్పకుండా పెంచారని మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరెంట్ ఛార్జ్ లు పెంచారు… ఛార్జ్ ల పెంపు ను డైవర్ట్ చేయడానికే ఢిల్లీకి మంత్రులను పంపించారన్నారు. ఓట్లు సీట్లు కొంటున్న కేసీఆర్ … ఇతర రాష్ట్రాల నేతలకు డబ్బులిచ్చి కొంటున్న సీఎం …ధాన్యం ఎందుకు కొనడం లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

మంత్రులని ఢిల్లీకి కొట్లాటకు పంపించావా… సమస్య పరిష్కారం కోసం పంపించావా అని ప్రశ్నించారు. కేసీఆర్ నిజం చెప్పిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు. కుట్రలలో, అబద్దాలలో, సెంటిమెంటును రగల్చడంలో నంబర్ వన్ కేసీఆర్. పీయూష్ గోయల్ నూకలు తినమని అన్నాడట… మేమైతే లేచి వచ్చే వాళ్ళం … మీకు రోషం ఏమైంది? పీయూష్ గోయల్ అలా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన అన్నీ బయట పెట్టే సరికి మంత్రులు మూసుకొని వచ్చారన్నారు.
వెంటనే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు. అబద్ధాలను నిజాలుగా నమ్మించేందుకు డ్రామా ఆడారు. వరి ధాన్యం పండించే ఇతర రాష్ట్రాలలో రాని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? రాజకీయంగా రాక్షస ఆనందం కోసం రైతులను సీఎం ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు బండి సంజయ్.

Exit mobile version