Liquor Smuggling : ఆదిలాబాద్ జిల్లా మద్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మహారాష్ట్ర నుంచి మద్యం సీసాలను కొత్త ఎత్తుగడలతో తరలిస్తున్న కేటుగాళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల నివేదిక ప్రకారం.. దేశిదారు మద్యం తరలింపులో నూతన మార్గాలు వెతుక్కుంటూ ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్లను దుండగులు ఉపయోగిస్తున్నారు. మద్యం సీసాలను ఈ జాకెట్లలో దాచిన వీరంతా వాటిని ఒంటిపై వేసుకొని రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ కుట్ర బట్టబయలైంది.
CM Chandrababu: యోగాంధ్ర సూపర్ హిట్.. హిస్టరీ క్రియేట్ చేయగలిగాం..
మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆపరేషన్‌లో సుమారు రూ.5 వేల విలువగల 140 మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అశోక్, రజిత, అరుణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరంతా మహారాష్ట్ర నుంచి మద్యం తీసుకొచ్చి తెలంగాణ గ్రామాల్లో విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అధికారులు మాట్లాడుతూ.. ఇటువంటి అక్రమ రవాణా ఘటనలపై గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Kubera : ‘కుబేర’ తో ఎన్నాళ్లకు హౌస్‌ఫుల్ బోర్డులు.. మళ్లీ జోష్‌లో ఇండస్ట్రీ
