NTV Telugu Site icon

రిజర్వేషన్ల ప్రకారం మద్యం షాపులు.. పెరిగిన షాపుల సంఖ్య..!

liquor

liquor

తెలంగాణలో మద్యం షాపుల సంఖ్య భారీగా పెరిగింది.. జిల్లాలో వైన్ షాపుల రిజర్వేషన్ వివరాలు ప్రకటించింది తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ.. రాష్ట్రంలో 404 మద్యం షాపులు పెరిగాయి… దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల సంఖ్య 2,216 నుండి 2,620కి పెరిగింది.. ప్రభుత్వం ముందుకు నిర్ణయించిన ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాల రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం.. లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు జరగనుంది… ఇక, రిజర్వేషన్ల ప్రకారం.. గౌడ్‌లకు 363(15 శాతం), ఎస్సీలకు 262(10 శాతం), ఎస్టీలకు 131 (5 శాతం) చొప్పున దుకాణాలు కేటాయించారు.. మరోవైపు.. ఓపెన్‌ కేటగిరీలో మిగతా 1,864 మద్యం దుకాణాలు ఉండనున్నాయి.. కాగా, వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.. అందుక కోసమే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపులలో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే..