హైదరాబాద్‌లోని మందు బాబులకు అలెర్ట్.. 24 గంటల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి… హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహించేందుకు భాగ్యనగరం సిద్ధమైంది.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రేపు గౌలిగూడ రాంమందిర్ నుండి తాడుబందు హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు.. రేపు ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్స్, రెస్టారెంట్స్, కల్లు దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.. నిబంధలు అతిక్రమిస్తే కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరించారు సైబరాబాద్ సీపీ.
Read Also: CM KCR : ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాకే సమస్యను పరిష్కరించారు