తెలంగాణలో ఊపందుకున్న మద్యం అమ్మకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయ్. వైన్‌షాపులు, బార్లు కళకళలాడుతున్నాయ్. కరోన తరువాత కాస్త నెమ్మదించిన అమ్మకాలు.. ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
తెలంగాణాలో మద్యం అమ్మకాలు మళ్లీ పెరిగాయ్. ప్రస్తుతం కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుతం దాదాపుగా 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం తో సర్కార్ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
కరోనా టైంలో బీర్ల వినియోగం చాలా వరకు పడిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయి. కూల్ డ్రింక్స్, బీర్లు తాగడంతో కోవిడ్ సోకే అవకాశలు ఉన్నాయన్న వార్తలతో బీర్ బాటిల్స్ ని పక్కన పెట్టేశారు బీర్ ప్రియులు. కరోన తరువాత చాలా మట్టుకు బీర్ల వినియోగం తక్కువగా ఉన్న కానీ సెప్టెంబర్ నుంచి బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే దాదాపు 25 శాతానికి పైగా బీర్స్ అమ్ముడయ్యాయి. ఇక బీర్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఒక్కో బాటిల్ పైన10 రూపాయల వరకు తగ్గించారు. ధరల తగ్గింపు కంటే కోవిడ్ భయం తొలగిపోవడం వల్లనే వినియోగం పెరిగిందని, దసరా కారణంగా బీర్స్ అమ్మకాలు పెరుగుతాయని అంటున్నారు.
ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తెలంగాణాలో 14వేల 320 కోట్ల అమ్మం అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా నుంచే 3వేల247 కోట్ల ఆదాయం వచ్చింది.. ఇక రెండో స్థానంలో ఉన్న నల్గొండ జిల్లాలో మద్యం అమ్మకాలపైన 1,599 కోట్ల ఆదాయం, తరువాత మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ నుంచి 1510 కోట్ల ఆదాయం వచ్చింది.
మొత్తంమీద కరోన కారణంగా చతికిల పడిన వ్యాపారాలన్నీ, కోవిడ్ తీవ్రత తగ్గడంతో గాడిన పడుతున్నాయి. సరిగ్గా పండగల సమయానికి కోవిడ్ తగ్గడం కూడా వ్యాపారులకు కలిసి వచ్చింది.
- Tags
- Dasara
- Liquor Sales
- telangana
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!