NTV Telugu Site icon

Liquor Rates: తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం రేట్లు

Liquor Tg

Liquor Tg

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మధ్యంపై భారీగా ధరలను పెంచింది. బీరు, లిక్కర్ ఇలా అన్నింటిపై రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీరు బాటిల్ పై రూ.20, విస్కీ, బ్రాందీ లిక్కర్ క్వార్టర్ పై రూ. 20, ఫుల్ బాటిల్ పై రూ. 80 పెంచింది. పెరిగిన రేట్లు మే 19 నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు అమ్మకాలు ముగిసిన తర్వాత మద్యాన్ని సీజ్ చేసి… నిల్వలు లెక్కించి రేపటి నుంచి కొత్తగా అమలులోకి వచ్చిన రేట్ల ప్రకారం అమ్మకాలు కొనసాగించనున్నారు.

పెరిగిన ధరలతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు మరింతగా ఆదాయం సమకూరనుంది. ఇప్పటికే  బీర్లు తెగ అమ్ముడవుతున్నాయి. వేసవి కాలం కావడంతో కూల్ కూల్ గా బీర్లను లాగించేస్తున్నారు మద్యం ప్రియులు. గతంలో కరోనా సమయంలో బీర్ల సేల్స్ పడిపోయాయి. దీంతో ఆ సమయంలో బీర్ల ధరలను తగ్గించారు. తాజాగా ప్రస్తుతం బీర్ల రేట్లు మరింత ప్రియం కానున్నాయి.

కాగా ధరలు పెరుగుదల సామాన్యులపై భారం పడనుంది. ఏకంగా రూ. 20 నుంచి రూ.80 వరకు పెరగడంతో మందుబాబుల జేబుకు చిల్లు పడనుంది. బీర్ సేల్స్ పెరుగాయని ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం ధరలను పెంచింది. పెరిగిన మద్యం అమ్మకాలను ప్రభుత్వం క్యాష్ చేసుకునేందుకే మద్యం ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. పెరిగిన మద్యం ధరలతో ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.