Site icon NTV Telugu

KCR: బంగారు భారత దేశాన్ని తయారు చేద్దాం..

ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్‌ కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. ఇతర పక్షాలను కూడా కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక, ఇవాళ బంగారు భారత దేశాయాన్ని తయారు చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు కేసీఆర్.. నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన ఆయన.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు.. బంగారు భారత్‌ తయారు చేసుకుందాం.. భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తయారు చేసుకుందాం అన్నారు కేసీఆర్..

Read Also: RIP Mekapati Goutham Reddy: రేపు ఎయిర్‌ అంబులెన్స్‌లో భౌతికకాయం తరలింపు

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి.. భారత దేశాన్ని బాగుచేసుకుందాం అని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అందరి దీవెన కావాలన్న ఆయన.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పని చేస్తున్నా.. ఢిల్లీ దాకా వెళ్లి కొట్లాడదాం.. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిద్దాం అన్నారు.. తెలంగాణలాగే దేశాన్ని అభివృద్ధి చేద్దామన్న కేసీఆర్.. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని స్పష్టం చేశారు.. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారు.. విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలన్నారు కేసీఆర్.. మరోవైపు.. జహీరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌ ప్రాంతాలకు నీరందాలని.. ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తిచేసేలా నేతలు కృషిచేయాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Exit mobile version