Site icon NTV Telugu

Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను ఆహ్వానిద్దాం

Revanth

Revanth

కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని టీపీసీసీ అద్య‌క్షులు రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. గాంధీ భవన్ లో టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్టే అని, ప్రతి కార్యకర్త దీనిపై స్పందించాలని అన్నారు.

రాహుల్ గాంధీ సోమవారం నాడు (13)న ఈ.డి కార్యాలయానికి వెళ్లి బయటకు వచ్చేంతవరకు ఈ.డి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలని అన్నారు. 15వ తేదీన అల్ పార్టీ మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నామ‌న్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని మండిప‌డ్డారు. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వం చేతులైతేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో సమావేశం పెడతామ‌ని, బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలను కూడా ఆహ్వానిద్దామ‌న్నారు.

రైతు రచ్చబండ కార్యక్రమాలు ఈ నెల 21 వరకు చేయాల్సి ఉందని , ఆ కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడిగిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. నాయకులు పని చేయకపోతే పదవులు రావు.. గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని ఎద్దేవ చేశారు. ఎప్పటికప్పుడు ఏఐసీసీ కి నివేదికలు వెళ్తున్నాయని రేవంత్ అన్నారు. పనిచేసి ప్రజల్లో నిత్యం ఉండే వాళ్ళకే పదవులు వస్తాయని విమ‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పాల్గొన్నారు.

Weather Update: తప్పిన అంచనాలు.. మొహం చాటేస్తున్న వానలు

Exit mobile version