Leaked Mission Bhagiratha water: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటింటికీ మంచినీరు అందించే పథకం రోడ్లపై ఆవిరైపోతోంది. వరంగల్ జిల్లా ఖానా పురం మండలం వేపచెట్టు తండా సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ పగిలి నీరు చిమ్మడంతో ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారి జలమయమైంది. రహదారికి అటు ఇటు వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రహదారిపై ఆరబో సిన వడ్లు తడిశాయని రైతులు తెలిపారు. వడ్లన్నీ నీటిలో కొట్టుకు పోయాయని వాపోయారు. మిషన్ భగీరథ నీరు పైప్ లైన్ ప్రధాన పైప్ కావడంతో నీరు ఎక్కువగా వచ్చాయి. పైప్ లైన్ పగలి నీరు ఎత్తున ఎగిసి పడుతుండటంతో.. రహదారి దాటడానికి గ్రామస్తులు వాహన దారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. నాసిరకం పైపులు ఏర్పాటు చేయడం వల్ల తరచు పైపు లైన్ పగులుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను అప్రమత్తం చేశారు. స్థానికులు భగీరధ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
Read also: Bhakthi TV Live: హనుమద్వ్రతం శుభ సందర్భంగా హనుమాన్ చాలీసా వింటే..
నాలుగు రోజుల కిందటే ఖానాపురంలో పైపు పగిలి 12 ఎకరాల్లో వడ్లు తడిసిన సంగతి మరచిపోకముందే మరోసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని 365వ జాతీయ రహదారిపై డిసెంబర్ 1న ఉదయం మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అయింది. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున భగీరథ నీరు ప్రవహిస్తోంది. నెలల తరబడి పంటల కోసం ఎదురుచూస్తున్న రైతులకు మిషన్ భగీరథ పైప్‌లైన్ కన్నీళ్లు తెప్పించింది. రోడ్లపై ఎండిపోయిన వరిపంటలన్నీ నీరుగా మారాయి. దీంతో 10 ఎకరాల్లో పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మరోవైపు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయి నీరు వృథాగా పోతోంది.
Andhra Pradesh: నేడు రాయలసీమ గర్జన.. కర్నూలులో భారీ ర్యాలీ