NTV Telugu Site icon

Ponnam Prabhakar: ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం.. కొంచెం ఓపిక పట్టండి

Ponnam Prabhaker

Ponnam Prabhaker

Ponnam Prabhakar: ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని.. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం ముగిసింది. ప్రజావాణి కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రెండు వైపులా భారీ క్యూ లైన్ బారులు తీరారు. ప్రజల సమస్యలను అధికారులు ఆన్లైన్ లో నమోదు చేసుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటల వరకు దరఖాస్తుల స్వీకరించారు. ఉదయం 10 గంటలలోపు హాజరైన వారికి అవకాశం కల్పించారు. భారీగా అగ్రి గోల్డ్ బాధితులు తరలి వచ్చారు.. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారిని ఆదుకోవాలని వారి సమస్యలను తెలిపారు. అనేక జిల్లాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజాభవన్‌కు చేరుకున్నారు.. ధరణి సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్ రూం సమస్యలతో జనం ఎక్కువగా వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

Read also: Top Headlines@1PM: టాప్‌ న్యూస్

అనతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని అన్నారు. కాగా.. తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, బీఎంఎస్ అనుబంధ టీఎస్‌పీటీఎంఎం ఆధ్వర్యంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణాలపై పునరాలోచన, బస్సుల సంఖ్య తగ్గించడం, ఓలా, ఉబర్, ర్యాపిడ్ బైక్‌ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించడం వంటి డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. త్వరలో ఆటో యూనియన్లతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Read also: PM Modi: పార్లమెంట్‌లోకి చొరబడిన వారికి ప్రతిపక్షాల మద్దతు దురదృష్టకరం : ప్రధాని మోడీ

ఈరోజు 5126 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో చాలా మంది సొంత ఇల్లు లేదని వచ్చారని అన్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారని, వాళ్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆ విషయం మా దృష్టికి వచ్చిందని అన్నారు. ఆటో వాళ్లు మా సోదరులే… వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలిపారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని సూచించారు. అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వ ఆలోచన ఉంటుందని అన్నారు. ఎవరూ నిరసపడొద్దని, త్వరలోనే మీ సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతామని తెలిపారు.
Parliament : ఎంపీల సస్పెన్షన్‌లో 1989 నాటి రికార్డు బద్దలు.. 34 ఏళ్ల చరిత్ర పునరావృతం అవుతుందా ?