NTV Telugu Site icon

ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలివ్వాలి.. హైకోర్టులో పిల్

ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారన్నారు న్యాయవాది అభినవ్. దీనిపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గుండెపోటు బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని హైకోర్టులో దాఖలైన పిల్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. 40లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పందం చేసుకుందన్నారు పిటిషనర్. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారని న్యాయవాది అభినవ్ కోర్టుకి తెలిపారు. పంట నష్టపోయి రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పిటిషనర్ వివరించారు. కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేలా ఆదేశించాలివ్వాలని పిటిషనర్ కోరారు.

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని పిటిషనర్ అన్నారు. వివరాలు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌సీఐకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ధాన్యం కొనుగోళ్లపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది హైకోర్టు.