ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారన్నారు న్యాయవాది అభినవ్. దీనిపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గుండెపోటు బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని హైకోర్టులో దాఖలైన పిల్‌లో…