NTV Telugu Site icon

Laurus Labs Paediatric HIV Treatment: పిల్లల్లో హెచ్ఐవీ చికిత్సకు లారస్ ల్యాబ్స్ Novel Delivery

Laurus Labs Paediatric Hiv Treatment

Laurus Labs Paediatric Hiv Treatment

Laurus Labs Paediatric HIV treatment: హైదరాబాద్‌కి చెందిన లారస్‌ ల్యాబ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్‌.. ఈ మూడు నెలల్లో కలిపి 234 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంస్థ లాభం 204 కోట్లు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. దీన్నిబట్టి ఈసారి నికరంగా 15 శాతం ఎక్కువ ప్రాఫిట్‌ను ఆర్జించింది. కంపెనీ ఆపరేషన్స్‌ ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,576 కోట్లు కాగా ఈ రెవెన్యూ గతేడాది ఇదే సమయంలో రూ.1,203 కోట్లు అని ఓ ప్రకటనలో తెలిపింది.

Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు ‘‘హైదరాబాద్’’ అస్త్రాలు

ఈ నేపథ్యంలో షేర్‌ హోల్డర్లకు 40 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీని ప్రకారం.. 2 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో వాటాపై 80 పైసలు చెల్లించేందుకు బోర్డ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా లారస్‌ ల్యాబ్స్‌ ఫౌండర్‌, సీఈఓ సత్యనారాయణ చావ మాట్లాడుతూ ఈ ఫలితాలు సంస్థ వ్యాపారాన్ని బలోపేతం చేసే దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. చిన్నారుల్లో హెచ్‌ఐవీ ట్రీట్మెంట్‌ కోసం తమ సంస్థ ఒక Novel Deliveryని డెవలప్‌ చేసినట్లు వెల్లడించారు.

ఇది క్లిక్‌ అయితే మార్కెట్‌లో కంపెనీ స్థాయి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ మూలధన కేటాయింపుల ప్రాధాన్యతల్లో మార్పేమీ లేదని, తమ లక్ష్యాలకు అనుగుణంగానే పెట్టుబడులు పెడతామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి అర్ధ వార్షికం పూర్తయినందున ఇక ద్వితీయ అర్ధ వార్షిక పనితీరు పైన ఫోకస్‌ పెడతామని, ఆదాయంలో వృద్ధిని, స్థిరమైన (30 శాతం) EBITDA మార్జిన్లను ఈ ఆర్థిక సంవత్సరంలో పొందుతామని సత్యనారాయణ చావ వివరించారు.

Show comments