Adilabad Rims: ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రి వద్ద అర్థరాత్రి సందడి నెలకొంది. ఆస్పత్రిలోకి చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. తాము రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ అభిమానులమని దుండగులు చెప్పినట్లు సమాచారం. ఆస్పత్రిలో అసౌకర్యాలపై ప్రశ్నించినందుకే తమపై దాడి చేసినట్లు సమాచారం. దుండగుల్లో కొందరు రౌడీ షీటర్లు ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం వైద్య విద్యార్థులకు, దుండగులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వైట్ కలర్ క్రెటా, బండ్లపై వచ్చిన దుండగులు వైద్య విద్యార్థులను దారుణంగా కొట్టారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి విధులను నిలిపివేశారు.
Read also: Ponnam Prabhaker: తనకు పాలన అనుభవం లేదు.. కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్
అర్ధరాత్రి క్యాంపస్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారని వైద్య విద్యార్థులు తెలిపారు. బయటి వ్యక్తులు గొడవ పెట్టుకోవడమే కాకుండా తమపై ఎలాంటి హెచ్చరికలు చేయకుండా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. తమపై బయటి వ్యక్తులు దాడి చేశారని ఆరోపించిన వైద్య విద్యార్థుల వివరాలను సేకరించారు. ఇంత జరుగుతున్నా రిమ్స్ అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థులు రిమ్స్ లో విధులు బహిష్కరించారు. దర్శకుడు దుండగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత విద్యార్థులు ప్లకార్డులు, దిష్టి బొమ్మతో రిమ్స్ వైద్య కళాశాల వరకు ర్యాలీ ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎమర్జెన్సీ విభాగం ఎదుట వినతిపత్రాలతో నిరసన తెలుపుతున్నారు.
రిమ్స్ లో మెడి కోల పై దాడి చేసిన వారి పై కేసు నమోదు చేశామని సిఐ అశోక్ అన్నారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రాత్రి రిమ్స్ క్యాంపస్ లోకి వచ్చిన వారిలో ఇద్దరు రౌడీ షీటర్ లు ఉన్నారని స్పష్టంచేశారు. వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గొడవ కంటే ముందు రిమ్స్ డైరెక్టర్, మెడికో ల మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసిందన్నారు. పూర్తి స్తాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Alla Ramakrishna Suspension: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేరుతో ఫేక్ లెటర్లు.. వైసీపీ ఆగ్రహం