Alla Ramakrishna Suspension: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేరుతో ఫేక్ లెటర్లు.. వైసీపీ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alla Ramakrishna Suspension: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, మంగళగరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసినట్లు.. ఫేక్ లెటర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆయనను పార్టీ నుంచి తొలగించినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ, అదంతా అవాస్తవం. ఇటీవల మంగళగిరి ఇంఛార్జ్‌గా పార్టీ మరొకరిని నియమించడంతో.. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు ఆర్కే. అయితే తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని చెప్పారాయన. పార్టీపై కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా మంగళగిరిని ఆళ్ల అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు వైసీపీ నేతలు. సామాజిక సమీకరణాల వల్ల మంగళగిరి నుంచి ఆర్కే బదులు.. మరొకరిని బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆళ్లపై పార్టీ యాక్షన్ తీసుకుందని, సస్పెండ్ చేసిందని.. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు లేఖలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు.
Read Also: Mohammed Shami: నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవడు ఆపుతాడు.. మహమ్మద్ షమీ ఫైర్!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రెండు రోజుల క్రితం ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే.. సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్కే.. రాజీనామా కారణాల్ని వెల్లడించడానికి నిరాకరించారు. మంగళగిరిలో పార్టీ పరిస్థితిపై సమీక్షించిన నేతలు.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆర్కే స్థానంలో బీసీ సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని బరిలో దించాలని వైసీపీ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆర్కేను సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో ఫేక్ లెటర్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఆర్కేను వైసీపీ సస్పెండ్ చేసిందన్న ప్రచారం అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!