NTV Telugu Site icon

తెలంగాణలో పెరిగిన భూముల విలువ.. ఎల్లుండి నుంచి అమల్లోకి

Land market value

Land market value

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ రుసుము పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.. పెంచిన మార్కెట్‌ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.. ఇక, వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్ఠంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల మార్కెట్‌ విలువ పెంపుతో పాటు, రిజిస్ట్రేషన్‌తో పాటు వాటికి సంబంధించిన 20 రకాల సేవలపై విధించే ఛార్జీలు పెరగనున్నాయి.. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్ఠంగా 50 శాతం పెరగనుండగా.. ప్రాంతాల వారీ విలువ ఆధారంగా అవి 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర వడ్డించనున్నారు.

అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల విలువు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచడం ఇదే తొలిసారి.. మొత్తంగా ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4 శాతం ఉండగా ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తం 6 శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను చెల్లిస్తున్నారు.. కానీ ఇప్పుడు ఇవి పెరగనున్నాయి.. తెలంగాణలో ఎల్లుండి నుంచి అల్లోకి వచ్చేవి పరిశీలిస్తే.. భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, విక్రయ అగ్రిమెంట్‌/జీపీఏ, డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌, జీపీఏ, డెవలప్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌, కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, కుటుంబ, కుటుంబేతరుల మధ్య ఒప్పందాలు, గిఫ్ట్‌, టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌, జీపీఏ, వీలునామా, లీజు సహా ఇతర సేవల ఛార్జీలు పెరగనున్నాయి. నూతన ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. సాగునీటి వసతి విస్తరించడంతో భూముల విలువ భారీగా పెరిగింది.రాష్ట్రంలో ఐటీ, ఔషధ, పర్యాటకం, స్థిరాస్తి రంగాల్లో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్‌రోడ్డు వివిధ రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో భూముల మార్కెట్‌ విలువలు సమరించింది ప్రభుత్వం..