NTV Telugu Site icon

భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని

లాల్ ధర్వాజ బోనాల జాతరకు హాజరైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర పండుగగా బోనాలను కేసీఆర్ ప్రకటించారని.. బోనాల పండుగ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలు పటిష్టం చేశామన్నారు.

red also : ఢిల్లీకి చేరిన విశాఖ ఉక్కు పోరాటం : రేపు, ఎల్లుండి నిరసనలు

ప్రయివేట్ దేవాలయాలకు ప్రభుత్వం డబ్బులు అందించడం దేశంలోనే ప్రప్రథమని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించడం ప్రభుత్వం ఉద్దేశ్యమని ప్రకటించారు. కరోనా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నా… ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని వెల్లడించారు. పాడి పంటలతో రైతాంగం సుభిక్షంగా ఉండాలని.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమని స్పష్టం చేశారు.