Harish Rao: కార్మికులకు సంబంధించి మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రైతు భీమా తరహా కార్మిక భీమా పథకాన్ని అమలు చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. ఇప్పటికే అమలవుతున్న పథకంలో సాధారణ మరణాలనికి ఇచ్చే భీమా మొత్తాన్ని మూడు లక్షలన్నర లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా వర్కర్ కార్డు రెన్యూవల్ ను పదేళ్లకు పెంచుతామని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు డిజిటల్ కార్డు ఖరీదు బాధ్యత తనదేనన్నారు. 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఈ మేరకు ప్రకటన చేశారు. సిద్దపేట పట్టణంలో కర్మక్ భవన్ కోసం హరీష్ రావు ఎకరం భూమిని కేటాయించారు.
Read also: David Warner Record: ప్రపంచ రికార్డు నెలకొల్పిన డేవిడ్ వార్నర్!
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో రైతుబంధు పొందిన అన్నదాతలు, ఏ కారణం చేత మరణిస్తే వారి కుటుంబానికి దశలవారీగా బీమా సొమ్ము అందించేలా ఈ పథకం అమలవుతోంది. ఈ విధంగా కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే.. నిర్మాణ ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు మరణిస్తున్న వార్తలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ పరిస్థితుల్లో కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగితే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ఇదిలా ఉండగా ఇలాంటి దుర్ఘటనలు ఎక్కడ జరిగినా బాధిత కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ పథకం అమలైతే భవన నిర్మాణంలో ప్రమాదవశాత్తు మృతి చెందినా కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది.
75 Hard Fitness Challenge: పాపం టిక్‌టాకర్.. అతిగా నీళ్లు తాగింది, ఆసుపత్రిపాలైంది