Site icon NTV Telugu

Warangal: పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక వ్యక్తి సూసైడ్

Man Died With Police Overac

Man Died With Police Overac

Kumar Died Becuase Of Police Official Torture: పోలీసుల వేధింపులకు ఒకరు బలి అయ్యారు. తనని నిత్యం వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు వీడాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల క్రితం దొంగతనం కేసులో అనుమానితుగా కుమార్ అనే వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడ్ని చిత్రహింసలు పెట్టారు. ఎంత వేడుకున్నా వదలకుండా, టార్చర్ పెట్టాడు. దీంతో కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. జీవితం మీదే విరక్తి కలిగి.. పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

వెంటనే అతడ్ని వరంగల్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు అక్కడ చికిత్స అందించారు. అయితే, కుమార్ ఆరోగ్యం మెరుగవ్వకపోగా మరింత క్షీణించడంతో హైదరాబాద్‌కు తరలించారు. నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు తమవంతు ప్రయత్నాలు చేసినా, ఫలితం లేకుండా పోయింది. చివరికి కుమార్ చికిత్స పొందుతూ.. ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ ఘటనతో కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల ఓవరాక్షన్ వల్లే కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుమార్ కుటుంబీకులు పై అధికారుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Exit mobile version