Site icon NTV Telugu

Tragedy: కూకట్‌పల్లిలో విషాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిన పతంగి తీస్తూ బాలుడు విద్యుత్ షాక్‌

Manza Kite

Manza Kite

Tragedy: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పతంగి ఎగురవేస్తూ ఒక బాలుడు విద్యుత్ షాక్‌కు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూకట్‌పల్లి ప్రాంతంలో ఒక బాలుడు పతంగి ఎగురవేస్తుండగా, అనుకోకుండా ఆ పతంగి దారం (మాంజా) తెగిపోయింది. గాలిలో తేలుతూ వెళ్లిన ఆ పతంగి సమీపంలోని ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. అయితే, ఆ పతంగిని తీసుకునే ఆరాటంతో బాలుడు ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లాడు. అక్కడ పతంగిని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Price Drop Alert : Samsung లవర్స్‌కు పండగే.. Galaxy A55 5Gపై రూ.20,000 డిస్కౌంట్..!

Exit mobile version