Site icon NTV Telugu

BRS KTR: నేడు నల్లగొండలో కేటీఆర్‌ పర్యటన..

Brs Ktr

Brs Ktr

Telangana: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్ తో పాటు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read also: Congress: సీఈసీ ముందు ప్రతిపాదనలు.. నేడు ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా..!

కాగా, సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ మండలం ముషంపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను కేటీఆర్‌ పరిశీలించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, బోనస్‌పై బహిరంగంగా నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగానే ఏప్రిల్ 2న జిల్లా కలెక్టర్లకు కేసీఆర్ మెమోరాండం జారీ చేశారని, పంట బోనస్ పై ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినతిపత్రం ఇచ్చారని, ఏప్రిల్ 6న అన్ని నియోజకవర్గాల్లో దీక్షలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

Read also: Chiranjeevi : ఆ ఘటన నన్ను భాధించింది..ఈరోజుకి కూడా అక్కడికి వెళ్లలేదు..

కాగా.. అంబర్ పేటలోని ప్రేమ్ నగర్ నుంచి ఆజాద్ నగర్, పటేల్ నగర్ వరకు కేటీఆర్ నిన్న పర్యటించారు. కేటీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగే కేటీఆర్ వారిని ఆప్యాయంగా పలకరించారు. యోగా శ్రేయస్సు గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారని కొందరంటే… దళిత బంధు పథకంతో హాయిగా జీవిస్తున్నామని మరికొందరు అంటున్నారు. మరికొందరు బీసీ బంధుతోనే ఉపాధి పొందుతున్నారని.. కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
Viral Video: ఒక్క క్యాచ్.. ముగ్గురు ఫిల్దర్స్.. అయినా కానీ..?!

Exit mobile version