Minister KTR: నేడు మంచిర్యాలలో కేటీఆర్ పర్యటన.. ఠాగూర్ స్టేడియంలో బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీ, క్యాతంపల్లి మున్సిపాలిటీల్లో రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో పాటు రూ.500 కోట్లతో చేపట్టనున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేయనున్నారు. మందమర్రిలో భారీ రోడ్ షో, రామకృష్ణాపూర్ లో ప్రగతి నివేదన సభలో మంత్రి పాల్గొంటారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మందమర్రికి చేరుకుంటారు.
భీమారం మండల పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.14.53 కోట్లతో నిర్మించనున్న రోడ్లు, బ్రిడ్జిల పనులను, చెన్నూరు నియోజకవర్గంలో రూ.20.40 కోట్లతో నిర్మించనున్న పది రోడ్ల పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం రూ.11.70 కోట్లతో పులిమడుగు, అందుగులపేట, సంద్రుంపల్లి వద్ద పాలవాగుపై వంతెనలు, చెన్ను పక్కన అక్కెపెల్లి వాగుపై బ్రిడ్జి కమ్ చెక్ డ్యాంల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మందమర్రి మండలం శంకరపల్లిలో రూ.500 కోట్లతో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేయనున్నారు. మందమర్రి మున్సిపాలిటీలో రూ.204.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం అనంతరం మార్కెట్ చౌరస్తాలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షో ముగిసిన అనంతరం క్యాత్నపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.50 కోట్లతో గాంధారి వనం సమీపంలో 250 ఎకరాల్లో నిర్మించనున్న కేసీఆర్ అర్బన్ పార్కు పనులకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. మున్సిపాలిటీలో మొత్తం రూ.108.16 కోట్ల పనులు ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు.
Also Read
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
తాజావార్తలు
-
2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!