Site icon NTV Telugu

KTR Tweet: ఎన్డీయే సర్కార్ పై సెటైర్లు

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌కి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. నిత్యం రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా తెలంగాణ మంత్రి కె.తారకరామారావు హాట్ కామెంట్స్ చేశారు. ఏప్రిల్ పూల్స్ డే సందర్భంగా ఎన్టీయే ప్రభుత్వం అచ్చెదిన్ జరుపుకోవాలని వేసిన ఒక కార్టూన్‌ కి స్పందించారు. ఆ కార్టూన్ ని రిట్వీట్ చేశారు. తాను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వాస్తవాలు వివరిస్తూనే వుంటానని అది చూసి తట్టుకోలేనివారు దయచేసి తనను అన్ ఫాలో కావాలని సూచించారు.

తాను మాత్రం ఎప్పుడూ మతోన్మాదాన్ని, తప్పుడు ప్రచారాలను ఎప్పుడూ ప్రజల ముందుకి తెస్తానన్నారు కేటీఆర్. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుని కేటీఆర్ తప్పుబడుతూనే వున్నారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ, కేంద్ర బీజేపీ నేతల్ని ఆడుకుంటూనే వున్నారు.

Exit mobile version