NTV Telugu Site icon

KTR: నేడు రాజన్న సిరిసిల్లకు కేటీఆర్‌..

Ktr

Ktr

KTR to Rajanna Sircilla today: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11.00గంటలకు దుమాల గ్రామంలో యాదవుల మల్లన్న పట్నాలకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజన్నపేట గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 12.30 గంటలకు దేవునిగుట్ట తండా (గొల్లపల్లి) గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం. మధ్యాహ్నం 1 గంటకు ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండా (తిమ్మాపూర్)గ్రామపంచాయతీ భవనం మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రాచర్ల తిమ్మాపూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. కేటీఆర్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ రాకతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.

Read also: Sudan: సూడాన్ ఘర్షణల్లో 61 మంది మృతి.. మృతుల్లో కేరళ వాసి

ఇక తాజాగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే. తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఆదే గ్రామంలో కొత్తగా నిర్మించిన వ్యవసాయ కాలేజీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామమంలో నూతనంగా నిర్మించిన ఎస్సీ హాస్టల్ ని ప్రారంభించారు. ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
Award Function : విషాదంగా అవార్డుల వేడుక.. వడదెబ్బతో 11మంది మృతి