NTV Telugu Site icon

Ktr to Meet Basar IIIT Students: నేడు బాసరకు కేటీఆర్‌.. ఐఐఐటీ విద్యార్థులతో సమావేశం

Ktr To Meet Basar Iiit Students

Ktr To Meet Basar Iiit Students

Ktr to meet basar iiit students today: పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో జైనథ్‌ మండలం దీపాయగూడకు చేరుకుని, మాతృ వియోగంతో ఉన్న ఎమ్మెల్యే జోగురామన్నను కేటీఆర్‌ పారమర్శించనున్నారు. అతరువాత ఆదిలాబాద్‌లోని బీజీఎన్చీ డేటా సొల్యూషన్స్‌ సందర్శించి, అక్కడ ఉద్యోగులతో పలు విషయాలపై మాట్లాడనున్నారు. అనంతరం నిర్మల్‌ బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శించనున్నారు. త్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో కేటీఆర్‌ భేటీ కానున్నారు.

Read also: Mukul Rohatgi: అటార్నీ జనరల్‌గా కేంద్రం ఆఫర్‌.. నో చెప్పిన ముకుల్ రోహత్గీ

త్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. జూన్‌లో త్రిపుల్‌ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో కలిసారు. సమస్యల పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. మరోసారి త్రిపుల్‌ ఐటీకి వస్తే మంత్రి కేటీఆర్‌ ను తప్పకుండా తీసుకువస్తా అని మాట ఇచ్చారు. దీంతో ఆహామీ మేరకు కేటీఆర్‌ తో కలిసి సబితా ఇంద్రారెడ్డి ఆర్టీయూకేటీకి వెళ్లనున్నారు. ఈనేపథ్యంలో కేటీఆర్‌ రాకతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యార్థులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

Read also: Chennakesavareddy: మల్లికార్జున థియేటర్ వద్ద బాలయ్య అభిమానులు రచ్చ

జూన్‌ 15న 2022లో ట్రిపుల్‌ ఐటీ నిరసనపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్‌. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు భరోసా ఇచ్చారు మంత్రి. తమ సమస్యలపైన స్పందించాలని విజ్ఞప్తి చేసిన విద్యార్థికి సమాధానమిచ్చారాయన. బాసర ట్రిపుల్‌ ఐటీ సమస్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల డిమాండ్లు
రెగ్యులర్‌ వీసీని నియమించాలి, ఆయన క్యాం పస్‌లోనే ఉండాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలని అన్నారు. ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలని తెలిపారు. ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. తరగతి, హాస్టల్‌ గదులకు మరమ్మతులు చేయాలని, ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలని కోరారు. మెస్‌ల మెయింటెనెన్స్‌ మెరుగ్గా ఉండేలా చూడాలని, పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. అయితే వీటిపై కేటీఆర్‌ స్పదిస్తారా. త్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్‌ లపై కేటీఆర్‌ ఎలా స్పందిస్తారు? అనే దాని ఆసక్తిగా మారింది.

Chennakesavareddy: మల్లికార్జున థియేటర్ వద్ద బాలయ్య అభిమానులు రచ్చ