NTV Telugu Site icon

Himanshu Rao: బాలకృష్ణ డైలాగ్ వైరల్‌.. ట్విట్ చేసిన కేసీఆర్‌ మనువడు..

Ktr Sun

Ktr Sun

Himanshu Rao: తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్సు రావు అధిక బరువు కారణంగా గతంలో అనేక సార్లు బాడీ షేమింగ్‌కు గురైన విషయం తెలిసిందే.. అయితే అప్పట్లో భారీ శారీరాకృతితో కనిపించే హిమాన్ష్‌ పై ఆన్‌ లైన్‌లో ట్రోలింగ్‌ కూడా చేసేవారు. ఇక రాజకీయ నాయకులు కొందరు కూడా కేసీఆర్ మనవడి శరీరాకృతిపై గతంలో వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై పలు సందర్భాల్లో తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. తన కుమారుడిపై కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన హిమాన్షు అనుహ్యంగా బరువు తగ్గారు…తనను ట్రోల్ చేసే వారికి దిమ్మతిరిగేలా కఠోర శ్రమతో బరువును తగ్గించుకున్నారు. ఇక ఓ నెటిజన్ హిమాన్ష్ రీసెంట్ ఫోటోను పోస్టు చేసి సెడెన్‌గా చూసి కేటీఆర్ అన్న అని అనుకున్నా ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. అయితే.. ఆ పోస్టుకు హిమాన్షు రావు తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. హీరో బాలకృష్ట డైలాగ్‌ను కోట్ చేస్తూ.. ‘సర్‌సర్లే ఎన్నెన్నో అనుకుంటా.., అన్నీ జరుగుతాయా ఏంటీ’ అంటూ రిఫ్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. బాలికృష్ణ డైలాగ్‌ తో చేసిన పోస్ట్‌ కు బాలయ్య నా మాజాకా.. డైలాగ్‌ ఎవరైనా వాడాల్సిందే అంటూ నెటిజన్లు కమెంట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీ్‌ట్‌ కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.
Sania Mirza: సానియాతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన షోయబ్‌ మాలిక్‌!