Site icon NTV Telugu

ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: కేటీఆర్‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 100 కోట్లకు పైగా జనాభా ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అంత సులువు కాదని స్పష్టం చేశారు. ఉపాధి కల్పించే కొత్త సంస్థలకు స్టార్టప్‌లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఏ దేశంలోనైనా ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగానే ఉంటాయని, నైపుణ్యం ఉంటే ఉద్యోగవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు.

Read Also: ఇంట్లో కూడా మాస్కు ధరించాల్సిందే: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

కొత్త పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ ఉద్యోగాలు కల్పించాలన్నారు. కాగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ద్వారాలు తెరించిందన్నారు. దీని ద్వారా అనుమతులు త్వరగా లభించడమే కాక ఆయా సంస్థల కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. యువత ఉద్యోగ కల్పనలపై దృష్టి సారించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Exit mobile version