NTV Telugu Site icon

KTR: మున్సిపల్‌ అధికారి అత్యుత్సాహం.. కేటీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Ktr

Ktr

జూలై 24న మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని అనుకున్న విషయం తెలిసిందే.. అయితే.. భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. దీంతో మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని​.. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile)’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూ మానవత్వం చాటుకున్నారు. కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్​ జి.గంగాధర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాశం అయింది.

read also: Astrology: జులై 30, శనివారం దినఫలాలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్​ జి.గంగాధర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈ నెల 24వ తేదీన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈనేపథ్యంలో.. వాట్సాప్ గ్రూపులో మున్సిపల్ కమిషనర్​ జి.గంగాధర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పుట్టినరోజు వేడకలకు హజరుకావాలని మున్సిపల్ సిబ్బందికి సందేశం పంపించారు. అయితే.. ఈ కార్యక్రమంకు సీనియర్ అసిస్టెంట్ టి.రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, మోహన్, బిల్ కలెక్టర్ శ్రవణ్​లు గైర్హాజరయ్యారు. దీంతో.. మున్సిపల్ కమిషనర్​ జి.గంగాధర్ గైర్హాజరైన నలుగురు సిబ్బందికి మెమో జారీ చేశారు. అంతేకాదు.. వారిని 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నాయకులు కమిషనర్‌ కు కేటీఆర్ అంటే ఇంత అభిమానమా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ఈ విషయం కాస్త.. మంత్రి కేటీఆర్‌ చెవిన పడింది. దీంతో సీరియస్‌ అయిన కేటీఆర్‌ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ అధికారిని సస్పెండ్ చేయాలని ట్విటర్ వేదికగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కమిషనర్ జి.గంగాధర్ తను చేసిన తప్పు దిద్దుకోవడానికి మరో ప్రకటన విడుదల చేసారు. అయినప్పటికీ.. మంత్రి ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఈయితే.. ఈ మెమోల జారీ విషయంలో సదరు అధికారిని కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. దీంతో.. మెమోలు జారీ చేస్తే ఏమికాదనే భరోసాను వారు ఇవ్వడంతో కమిషనర్ జారీకి సమ్మతించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆరే స్వయంగా కమిషనర్​ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు.

Read also: Monkeypox: యూరప్ రకానికి భిన్నంగా ఇండియా మంకీపాక్స్ వైరస్