Site icon NTV Telugu

Ktr Tweet: నాడు రైతులతో .. నేడు జవాన్‌లతో..

Modi

Modi

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంపై కేటీఆర్ ట్విటర్ వేదికగా మండిప‌డ్డారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్‌లతో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ‘అగ్నివీర్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ – నో పెన్షన్ వరకు!’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు.

‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భగ్గుమ‌నింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అక్కడికి పోలీసులు వచ్చి చేరడంతో పరుగున రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి అక్కడి రైళ్లను ధ్వంసం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నామరూపాల్లేకుండా చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు. అనంతరం బలగాలను రప్పించుకుని ఆందోళకారులపైకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి.

Agneepath Scheme: సికింద్రాబాద్‌ విధ్వంసంపై స్పందించిన రేవంత్‌

Exit mobile version