NTV Telugu Site icon

KTR Nizamabad Tour: నేడే నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్.. శంకుస్థాపనలు, బహిరంగ సభ

Ktr Nizamabad Tour

Ktr Nizamabad Tour

KTR Nizamabad Tour: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించనున్నారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ఆవరణలో కొత్త నిర్మస్తున్న కళాభారతికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైల్వే కమాన్‌ వద్ద నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్‌ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నారు. కేటీఆర్‌ రాక సందర్భంగా నగర పరిధిలో గులాబీ శ్రేణుల, నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ నేడు ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌ కు చేరుకోనున్నారు. కాకతీయ శాండ్‌ బాక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రారంభించడంతో పాటు కళాభారతికి శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత జరిగే బహిరంగ సభలో కేటీఆర్‌ ప్రసంగిస్తారు. కేటీఆర్ వెళ్లే దారిలో భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు నగరంలోని బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేశారు.

Read also: Saturday Special Live: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట్లో కనకవర్షమే..

మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ఆవరణలో కళా భారతి భవన నిర్మాణ ప్రణాళికకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దాదాపు రూ. 50 కోట్లతో నిర్మించనున్న కళాభారతి ఆడిటోరియం ప్రణాళికలను సమీక్షించారు. అధునాతన సౌకర్యాలతో ఈ ఆడిటోరియం నిర్మిస్తారు. ఇందూర్‌ జిల్లా చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేందుకు ఈ నిర్మాణం రూ.50 కోట్లుతో ఉండనుంది. మంత్రి కేటీఆర్‌ రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ఆవరణలో నిర్మించతలపెట్టిన కళాభారతి భవన నిర్మాణ ప్లాన్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సుమారు రూ. 50 కోట్లతో నిర్మించే కళాభారతి ఆడిటోరింయకు సంబంధించిన ప్లాన్‌లను పరిశీలించారు. అధునాతన సౌకర్యాలతో ఈ ఆడిటోరియంను నిర్మించనున్నారు. ఇందూరు జిల్లా చారిత్రక వైభవం చాటేవిధంగా రూ.50 కోట్లతో ఈ నిర్మాణం ఉండనుంది. సంస్కృతీ సంప్రదాయాలను ఉట్టిపడేలా కళాభారతి రూపొందిస్తామన్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చూసుకుంటున్నారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Show comments