Site icon NTV Telugu

KTR: ఆస్ట్రేలియా ఇండియా ఇనిస్టిట్యూట్ సీఈవోతో భేటీ

Australia

Australia

ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈఓ లిసా సింగ్ తెలంగాణ మంత్రి కె.తారకరామారావుతో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మరియు ఆస్ట్రేలియా లోని వ్యాపార వాణిజ్య వర్గాల సంబంధాలను బలోపేతం పైన ఇరువురు చర్చించారు. భారతదేశంలో అత్యంత వేగంగా వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ర్టాలలో తెలంగాణ ఒకటని తెలంగాణతో ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ రంగాలతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఐటి, లైఫ్ సైన్సెస్, రెన్యువల్ ఎనర్జీ వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, వీటిలో ఆస్ట్రేలియా లో ఉన్న పలు కంపెనీలు తెలంగాణ లోని పెట్టుబడుల పైన ఆశావహంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ కి ఆమె తెలిపారు.

భారత్ ఆస్ట్రేలియాల మధ్య వ్యాపార వాణిజ్యలకు సంబంధించి అనేక నూతన ఒప్పందాలపై చర్చ నడుస్తున్న సందర్భంగా, త్వరలోనే ఒక ప్రతినిధి బృందం ఇక్కడి పెట్టుబడి అవకాశాలు పైన పరిశీలన చేసేందుకు భారతదేశంలో పర్యటించనున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఇప్పటికే తెలంగాణలోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తున్న విషయాన్ని తెలిపిన లిసా సింగ్ వి హబ్ తమ భాగస్వామి అని వివరించారు.

Also Read:Pudding and Mink Pub: ముగిసిన తొలిరోజు ఆ ఇద్దరి కస్టడీ విచారణ
తెలంగాణ మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య పెట్టుబడులకు సంబంధించి అనేక అవకాశాలు ఉన్నాయని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆయా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ లిసా సింగ్ కి తెలిపారు. భారతదేశంలోని విధి విధానాల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వానికి కొంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉంటుందని, ఇలాంటి నేపథ్యంలో ప్రగతిశీల తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఆస్ట్రేలియాలోని పారిశ్రామిక వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

Exit mobile version