Site icon NTV Telugu

Minister KTR: వడ్డీ లేకుండానే హోమ్ లోన్లు..! కేటీఆర్ కీలక ప్రకటన

Ktr Minister

Ktr Minister

Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద పెద్ద పార్టీలు వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీల మేనిఫెస్టోలు వచ్చేశాయి, ఓటింగ్ ప్రక్రియకు సమయం కూడా దగ్గరపడుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే ఆరు హామీలతో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసింది. అన్ని వర్గాలను ఆకర్షించే దిశగా అడుగులు వేసింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పలు హామీలను ప్రకటించినప్పటికీ… కొన్ని కీలక ప్రకటనలు చేస్తోంది. తాజాగా ఆటో వాహనాల ఫిట్‌నెస్ ఛార్జీలు మినహాయిస్తున్నట్లు ప్రకటించగా… తాజాగా మరో ప్రకటన చేశారు కేటీఆర్. హెచ్‌ఐసీసీలో క్రెడాయ్ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023లో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ఇల్లు కొనాలనుకునే వారి కోసం కొత్త పథకాన్ని రూపొందించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందరికీ ఇళ్లు అనే నినాదానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.

Read also: Telangana Elections 2023: రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు.. మోడీ, అమిత్‌షా, యోగీ, జేపీ నడ్డా ప్రచారం

అయితే ప్రస్తుతం డబుల్ బెడ్‌రూం, గృహలక్ష్మి పథకాలు అలాగే ఉంటాయని, కొత్త ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజల కోసం త్వరలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. రుణం తీసుకుని ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తోందని కేటీఆర్ తెలిపారు. అదే సమయంలో, ఓటింగ్ ప్రక్రియ నవంబర్ 30న మాత్రమే ఉంటుంది. ప్రచారానికి అతి తక్కువ సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో… అధికార బీఆర్ఎస్ నుంచి కీలక ప్రకటనలు వస్తాయా అనే చర్చ కూడా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో మరిన్ని అంశాలు చేరుస్తాయనే చర్చ మొన్నటి వరకు జరిగినా…అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఆలోచించాలని నేతలు ప్రకటనలు చేస్తూ ప్రజలను ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.
KTR Metro: మెట్రో రైలులో కేటీఆర్‌ సందడి.. రాయదుర్గం నుంచి బేగంపేట వరకు ప్రయాణం

Exit mobile version