BRS KTR: కష్ట కాలంలో కేకే, కడియం పార్టీ వదిలి వెళుతున్నారు..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు… వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను… కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని అన్నారు. ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా… పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తా అన్నారు. ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తా.. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటా అని హమీ ఇచ్చిన కేటీఆర్ అన్నారు. రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారన్నారు.
Read also: Komati Reddy: బీఆర్ఎస్ దుకాణం బంద్.. 8 మంది బీజేపీ నుంచి వస్తారు..!
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం… 2019లో రంజిత్ రెడ్డి మాధురి పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయినారని తెలిపారు. కేసీఆర్ కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్లోకి పోయిన రంజిత్ రెడ్డి… పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే మహేందర్రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయమన్నారు. మల్కాజిగిరిలో పోటీ చేయాలని సీఎం కే విసిరిన సవాలు రేవంత్ రెడ్డి స్పందించలేదన్నారు. ఆయన సొంత సిట్టింగ్ ఎంపి స్థానంలోనే పోటీకి వెనకంజ వేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Read also: Komati Reddy: పెద్ద సినిమాలు.. థియేటర్ ల దోపిడీ.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
రేవంత్ రెడ్డి లీకువీరుడుగా మారిండు… ఎన్నికల హమీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేవారు. రైతులకు రుణమాఫీ, 4000 పించన్లు, 2500 మహిళలకు, అందరికీ ఉచిత కరెంటు ఇలాంటి అన్ని హమీలు తుంగలో తొక్కిన్రు అంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారఢీలు మిగిలినవి.. రాష్ట్రంలో ఏవర్గం ఈ రోజు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇయ్యాలని డిమాండ్ చేశారు. రేవంత్ 5 ఏండ్లు ప్రభుత్వంలో ఉండు.. నీ 420 హమీలు నేరవేర్చు… నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులు అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ బీ-టీమ్ అన్నారు.
Read also:Malothu Kavitha: నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాలోత్ కవిత
కానీ ఎన్నికల తర్వతా రేవంత్ రెడ్డి బీజేపీ బీ-టీమ్ గా మారిండని అన్నారు. రేవంత్ రెడ్డి.. రాహుల్ రెడ్డికోసం పనిచేస్తున్నారా… లేదా మోడీ కోసమా చెప్పాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్ధితి లేదు… బిజెపిన అపేందుకు బలమైన స్ధానిక నేతలే అని గుర్తుంచుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే, అది బిజెపికి లాభం అవుతుందన్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు… పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని తెలిపారు.
Read also:BRS Party: హస్తం గూటికి కడియం.. కాంగ్రెసోళ్లు జర జాగ్రత్త
ఆయన కేవలం రంగారెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితుడుజజ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ముఖ్యంగా ముదిరాజులకు అనేక సేవలు చేసిన నాయకుడు జ్ఞానేశ్వర్ అన్నారు. చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ గారు అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్ బలోపేతం చేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో బిసిలకు అత్యధిక స్ధానాలు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 13 తేదిన జరిగే చెవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరు తరలిరావాలని పిలుపు నిచ్చారు.
K. Keshava Rao: సీఎం రేవంత్ రెడ్డి తో ముగిసిన కేకే భేటీ..
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?