Site icon NTV Telugu

రాత్రిపూట రోడ్డు ప్రమాదం : మంచి మనసు చాటుకున్న కేటీఆర్‌

KTR

మంత్రి కేటీఆర్‌ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. సిద్ధిపేట ఔటర్ బైపాస్ పైన, మెడికల్ కాలేజీ దగ్గరలో నిన్న రాత్రి బైక్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ కు ఢీ కొట్టి, తీవ్రంగా గాయపడ్డారు సిద్ధిపేటకు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు. అయితే.. అదే సమయంలో సిరిసిల్ల పర్యటన ముగించుకున్న కేటీఆర్‌.. అదే మార్గంలో వచ్చారు.

read also : మహిళలకు షాక్‌… మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈ నేపథ్యంలో ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయిన మంత్రి కేటీఆర్‌… వెంటనే తన కాన్వాయ్ లోని 2 కార్లల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ బాధితులకు అండగా.. తన పీఏతో పాటు ఎస్కార్ట్ పోలీసులను పంపించారు. ఆ తర్వాత క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ లో సూచించారు మంత్రి కేటీఆర్‌. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ చూపిన చొరవపై… బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version