Site icon NTV Telugu

KTR Tweet: ప్రజల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ ను తీసుకొచ్చారా?

Ktr Modi

Ktr Modi

బీజేపీ స‌ర్కార్ తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్‌కు నిరసనగా రాజకీయ పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్‌ ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

అగ్నిపథ్‌తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్రమంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్‌లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారని.. మరో బీజేపీ నేత చెప్పారన్నారు. పీఎం మోదీని అర్థం చేసుకోలేదని యువతను నిందిస్తున్నారా? అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ ను తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. మోదీ-ఆదానీ అవినీతిపై.. శ్రీలంక ఆరోపణల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని తన ట్వీట్‌లో కేటీఆర్ ఆరోపించారు.

Asaduddin Owaisi: మోడీ జీ.. మీ ఫ్రెండ్ అబ్బాస్ అడ్ర‌స్ ఇవ్వండి

Exit mobile version