దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి ఇంధనం ధరలు పెరుగుతూ ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై, బీజేపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ట్విట్టర్‌లో.. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బీజేపీవాళ్లు మొదటి నుండి చెపుతూనే ఉన్నారు మనకే అర్దం కావడం లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా డబుల్ ఇంజన్ అంటే.. పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ చేయడం, కార్పొరేట్ సంస్థల సపదన డబుల్ చేయడం, నిత్యవసర వస్తువుల ధరలు డబుల్ చేయడం, గ్యాస్ ధరలు డబుల్ చేయడం అంటూ పోస్ట్ చేశారు.
దీంతో పాటు.. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు విషయంలో ప్రధాని పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పెట్రో ధరల పెంపు విషయంలో గతంలో యూపీఏ ప్రభుత్వం ను మోడీ ప్రశ్నించిన ట్వీట్స్ తో.. మోడీను ప్రశ్నిస్తూ.. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ, మిషన్ భగీరథ పథకానికి భారత ప్రభుత్వ సహకారం ఎంత ఉందో దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోండి.. మిషన్ భగీరథ స్కీమ్ కు మీ ప్రభుత్వం సున్నా సహకారం అందించడం ప్రధానమంత్రి స్థాయికి తగినది కాదని కేటీఆర్ అన్నారు.
