NTV Telugu Site icon

KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు

Ktr

Ktr

KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు. మొత్తం లెక్క తెస్తే 420 హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నారని గుర్తు చేశారు. తుమ్మల నాగేశ్వర రావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారి చేశారని అన్నారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైందన్నారు. నోటికి ఎంత వస్తె అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. అందుకే 420 హామీలను చేసేదాకా విడిచి పెట్టమని కేటీఆర్ అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతుందన్నారు.

Read also: Bhanu Prakash Reddy: వైనాట్ 175 అంటే దొంగ ఓట్ల దందానేనా..? సీబీఐ విచారణకు సిద్ధమా..?

ఈసారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరబోతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. అయితే నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్ అయిన విషయం తెలిసిందే.. ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు హైదరాబాద్‌లో కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులు సృష్టించి బంగారు తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ఇక నుంచి కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ గెలవడం కష్టం కాదని కేటీఆర్ అన్నారు.
Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..

Show comments