Site icon NTV Telugu

కృష్ణా జలాల విషయంలో టీఆర్ఎస్ అనుకున్నది సాధిస్తుంది…

ktr

కాంగ్రెస్, బిజెపిలకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు కావాలని.. కానీ టీఆరెస్ కు మాత్రం ఒకే ఒక్క రాష్ట్రం అదే తెలంగాణ అని కేటీఆర్‌ చెప్పారు. కృష్ణా జలాల విషయంలో టీఆరెస్ పార్టీ అనుకున్నది సాధిస్తుందని స్పష్టం చేశారు కేటీఆర్‌. హైదరాబాద్ చుట్టు పక్కల మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ ల పరిధిలో మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి సబితా, మల్లా రెడ్డికి బాధ్యతలు అప్పగించామన్నారు.

read also : వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపు ఖాయం : రఘునందన్ రావు

ఎవరెన్ని పిచ్చి కూతలు , కుప్పి గంతులు వేసినా టీఆరెస్ దే హవా అని వెల్లడించారు. కొంత మంది ఒకటి, రెండు పదవులు రాగానే… కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వ్యవహారిస్తున్నారని చురకలు అంటించారు. రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు సైతం టీఆరెస్ వైపు చూస్తున్నారని… ఇందుకు ఉదాహరణ ఎల్.రమణ చెప్పుకొచ్చారు కేటీఆర్‌.

Exit mobile version